లక్ష్మీదేవి అనుగ్రహం లభించి సుఖ సంతోషాలతో ఉండాలని అంతా కోరుకుంటారు. అయితే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్నింటిని పాటించాలని పండితులు పేర్కొంటున్నారు.వాస్తు శాస్త్రం ప్రకారం అల్మరాను ఇంటి దక్షిణ గోడకు ఆనుకునే విధంగా ఉంచాలి. దాన్ని ఎప్పుడూ ఖాళీగా ఉంచకుండా డబ్బులు, నగలు వంటివి అందులో ఉంచాలి వాటితో పాటు తమలపాకులు, లక్ష్మీ యంత్రాన్ని ఉంచాలి. ఎరుపు రంగు గుడ్డలో పసుపు ముద్ద కట్టి అల్మరాలో ఉంచితే లక్ష్మి నిలుస్తుందని పండితులు పేర్కొంటున్నారు. ప్రతిరోజూ ఖజానాను పూజించాలని సూచిస్తున్నారు.