ఏపీలో 2022-23 సీజన్ కు సంబంధించి వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ మూడో విడత సాయం ఈ నెల 27న రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ తెలిపారు. రబీ సీజన్ లో సాగు అవుతున్న పంటల నమోదుతో పాటు ఈ-కేవైసీని ఈ నెల 28వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. గతేడాది మాండూస్ తుఫాన్ వల్ల జరిగిన పంట నష్టానికి సంబంధించిన రూ.76 కోట్ల పరిహారాన్ని కూడా ఈ నెల 27న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa