ఆంధ్రప్రదేశ్ శాసనమండలి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థిగా పశ్చిమ నియోజక వర్గం పరిథి జీవీఎంసీ 90 వార్డు లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన న్యాయవాది చెవ్వేటి జీవన్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు జిల్లా సహాయ ఎన్నికల అధికారి మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తికి ఒక సెట్ నామినేషన్ పత్రాలను అందజేశారు.