దొండపర్తిలోని శ్రీ ఎరుకుమాంబ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాల్లో భాగంగా గురువారం శ్రీ అమ్మవారికి దొండపర్తి గ్రామ ప్రజలు సారె సమర్పించారు. వివిధ రకాలైన మిఠాయిలను అమ్మవారి పాదాల వద్ద నుంచి ప్రత్యేక పూజలు చేశారు. మేళ తాళాలు మంగళ వాయిద్యాలతో సుమారు 200 మంది భక్తులు దేవస్థానంకు విచ్చేసి శ్రీ అమ్మవారికి పలు రకాల మిఠాయిలను సమర్పించారు. దేవస్థానం ఈఓ జి. వి రమాబాయి ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతకు మునుపు ఇటువంటి కార్యక్రమం నిర్వహించనప్పటికీ ఈ ఏడాది ప్రత్యేకంగా అమ్మవారికి సారెను సమర్పించారు ఈ నెల 18వ తేదీన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ అమ్మవారి దేవస్థానంలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం 12 గంటలకు దేవస్థానం ఆవరణలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రమాబాయి తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు.