ప్రధాని మోదీ డిజిటల్ చెల్లింపులపై ప్రశంసలు కురిపించారు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పరిపాలన, ఆర్థిక సేవల వినియోగం, ఈజ్ ఆఫ్ లివింగ్ ను గణనీయంగా మార్చిందని అన్నారు. వాతావరణ మార్పు లాంటి సవాళ్లను ఎదుర్కొనేటందుకు మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంకులను పటిష్టం చేయాలన్నారు. బెంగళూరులో జరుగుతున్న జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు