గుజరాత్ లో గత నెల నిర్వహించిన పంచాయితీ జూనియర్ క్లర్క్ పరీక్ష పేపర్ లీకవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంపిటీటివ్ ఎగ్జామ్ పేపర్ ను ఎవరైనా లీక్ చేస్తే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.కోటి జరిమానా విధించేలా అసెంబ్లీలో నూతన బిల్లును ప్రవేశపెట్టింది. అలాగే నిందితులు రెండేళ్లపాటు ఎలాంటి పోటీ పరీక్షలు రాయకుండా నిషేధించింది. 10, 12వ తరగతి, వర్సిటీ పరీక్షలకు ఈ నిబంధనలు వర్తించవు.