ఇటీవలే టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల్లో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన కలిసి పని చేయాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని అన్నారు. ఇరు పార్టీల నాయకులు కూర్చుని, పొత్తుకు ఎంత వరకూ అవకాశం ఉందో మాట్లాడుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ నేతలైనా ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని సూచించారు. కాగా, అమరావతి, రాష్ట్రాభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని కన్నా పునరుద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa