సాధారణంగా మనకు ఎక్కిళ్లు వస్తే నీళ్లు తాగితే కొద్దిసేపటికి తగ్గిపోతాయి. అయితే, 2 రోజులకు మించి ఎక్కిళ్లు వేధిస్తుంటే అనర్థమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తేలకపాటి ఛాతినొప్పితో ఎక్కిళ్లు వస్తుంటే అది స్ట్రోక్ రావడానికి సంకేతం కావచ్చట. ముఖ్యంగా ఇది మహిళల్లో ఎక్కువంటున్నారు. చాలా అరుదుగా లివర్ లేదా కిడ్నీ క్యాన్సర్ వల్ల కూడా ఆగకుండా ఎక్కిళ్లు రావొచ్చని, బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనిపించొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.