అదానీ గ్రూపుపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ లోని ఏడు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ ఆస్తులు భారీగా తరిగిపోతున్నాయి. జనవరి 24 నాటికి పెట్టుబడుల విలువ రూ.81,268 కోట్లు ఉండగా, ఫిబ్రవరి 24 నాటికి రూ.32,610 కోట్లకు(నష్టం రూ.48,658 కోట్లు) పడిపోయింది. అదానీ గ్రూపులో ఎల్ఐసీ ఈక్విటీల వాటా గతంలో రూ.30,127 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.26,193 కోట్లకు తగ్గింది.