తిరుమల లడ్డూ కేంద్రాల్లో తాటాకు బుట్టలను ఉంచాలని టీటీడీ నిర్ణయించింది. సంప్రదాయ వృత్తుల ప్రోత్సాహంతో పాటు ప్రకృతి పరిరక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రకృతి వ్యవసాయవేత్త విజయరామ్ సహకారంతో ఈ బుట్టలను భక్తులకు అందుబాటులో ఉంచేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయంతో తాటి చెట్లను పెంచే వారికి ఆదాయం, తాటాకు బుట్టలు తయారు చేసేవారికి ఆర్థికంగా చేయూత అందుతుందని టీటీడీ భావిస్తోంది.