తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7 వరకూ జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకూ పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. తొలిరోజు శ్రీరామచంద్రమూర్తి అవతారం, రెండో రోజు శ్రీకృష్ణ అవతారంలో మూడుసార్లు పుష్కరిణిలో విహరిస్తారు. మార్చి 5న మలయప్ప స్వామిగా భక్తులను అనుగ్రహిస్తారు. అలాగే మార్చి 6న ఐదుసార్లు, చివరి రోజు ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరిస్తారు.