యూపీ ప్రయాగ్రాజ్లోని రాజుపాల్ సంచలన హత్య కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్, అతని సెక్యూరిటీ గార్డులపై శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసారు. ధుమన్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమేష్ పాల్ ఇంటి బయట దుండగులు బాంబులు, బుల్లెట్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఉమేష్ పాల్, అతని సెక్యూరిటీ గార్డు సందీప్ నిషాద్ మరణించారు. గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.