ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రామాల్లో వరుస చోరీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 12:16 PM

వరుస చోరీలతో లేపాక్షి మండలం కంచిసముద్రం గ్రామస్థులు అల్లాడిపోతున్నారు. దీంతో గ్రామస్తులు దొంగలను పట్టుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన 24 గంటలు గడవకముందే మళ్లీ దొంగతనం జరిగింది. కంచిసముద్రం ప్రధాన రహదారిలో అదేవీధిలో గురువారం రాత్రి చోరీ జరిగింది. లక్ష్మమ్మ అనే మహిళ ఇంటికి తాళంవేసి బంధువుల ఊరికి వెళ్లగా గురువారం రాత్రి దొంగలు తాళం వేసి పగలకొట్టి ఇంటిలో ఉన్న రూ. 10వేల నగదు, కమ్మలు, గాజులు, ఉంగరాన్ని దోచుకెళ్లారు. ఉదయం పక్కింటివారు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు వెనుతిరిగారు. బాదితురాలు ఇంటికి తిరిగిరాగా విషయం తెలుసుకుని స్టేషన్ వద్దకు వెళ్లింది. అరు తే ఎస్ఐ స్టేషన్లో లేకపోవడంతో ఫిర్యాదు స్వీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు కట్టడి చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విచారణ జరిపి చోరీలను ఆపాలని గ్రామస్థులు కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com