తమిళనాడులోని ఈరోడ్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 27న ఉపఎన్నిక పోలింగ్ జరుగనుంది. శనివారంతో ప్రచార గడువు ముగియనుంది. దీంతో నియోజకవర్గవ్యాప్తంగా పలు పార్టీలు ఎన్నికల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సాయంత్రం 5 గంటల్లోగా ఖాళీ చేయాలని, స్థానికేతరులు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశించారు. కాగా డీఎంకే కూటమి అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్ కు మద్దతుగా సీఎం స్టాలిన్ ప్రచారం చేయనున్నారు.