టీఎన్టీయుసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురాంరాజు ఈనెల 27న పెనుకొండకు వస్తున్నారు. ఆయన పర్యటన విజయవంతం చేద్దామని టీఎన్ టియుసి నాయకులు కోరారు. శుక్రవారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరిని బాలకృష్ణ నివాసం వద్ద సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షులు బాబా, కార్యదర్శి వీవర్స్కలనీ ఆంజనేయులు మాట్లాడుతూ టీఎన్టీయ సీ రాష్ట్ర అధ్యక్షుల పర్యటనకు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలన్నారు. కార్మిక సమస్యలపై రాజీలేని పోరాటంచేద్దామని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో బాబయ్య, గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.