ఓబుళదేవరచెరువు, మండలంలోని సున్నంపల్లి గ్రామంలో రైతులు ఉరవకొండ మాబూ, ఉరవకొండ వన్నురప్ప సాగుచేసి మొక్కజొన్న పంటను కదిరి పరిశోధన వ్యవసాయ శాస్త్రవేత్తలు వేమన, నీలిమ పరిశీలించారు. పంట విత్తే సమయంలో, 30, 45, 60 రోజులకు 35 కిలోల యూరియా వేయాలన్నారు. కత్తెర పురుగు ఆశిస్తే ఎకరాకు ఎమావేషన్ మేజోట్ 80 గ్రాములు లేదా క్లోరీ పైరాస 500 ఎంఎల్ను ఎకరాకు పిచికారి చేయాలని సూచించారు. కత్తెరపురుగు చివరి దశలో ఉంటే విషపు ఎర్రలు వాడాలన్నారు. వారివెంట సహాయ సంచాలకులు సత్యనారాయణ, ఎఓ ఇలియాజ్ అహమ్మద్, ఆర్బీకే ఇన్చార్జిలు ఉన్నారు.