ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 63వ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. అనంతపురంలోని ఆయన స్వగృహంలో యువనేత ప్రణయ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన సంబరాలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాల ప్రభుత్వ సలహాదారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ హాజరై మాజీ ఎమ్మెల్యేకి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విదంగా అభిమానులు, వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ప్రియతమ నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపెందుకు అనంతపురం క్యూ కట్టారు. విశ్వేశ్వరరెడ్డి దంపతులకు శాలువా, పూలమాలలతో సత్కరించి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. వారు తెచ్చిన కేకులను విశ్వేశ్వరరెడ్డి కట్ చేసి అభిమానులకు తినిపించారు.