ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వేంపల్లి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర బాలిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు (మోటివేషన్ క్లాస్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు విజయకుమారి, ఖాజా ఫర్విన్, వెంకటరమణయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.