ఏపీలోని నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరుకు చెందిన దేవేంద్రరెడ్డి కూతురు ప్రసన్న(21)కు రెండేళ్ల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో వివాహమైంది. అయితే ప్రసన్న పెళ్లికి ముందే మరో వ్యక్తిని ప్రేమించడంతో, భర్తను వదిలేసి పుట్టింటికి వచ్చింది. కాపురానికి వెళ్లమని తండ్రి ఎంత చెప్పినా వినలేదు. దీంతో పరువు పోయిందని దేవేంద్రరెడ్డి ఈనెల 10న ప్రసన్నను చంపేసాడు. తల, మొండెం వేరుచేసి నల్లమల అడవుల్లో పడేశాడు.