దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా పేద ప్రజలకు కనీస సౌకర్యాలు అందడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనకు చెందిన వీడియో బయటికి వచ్చింది. ఈ వీడియోలో మృతదేహాన్ని తరలించేందుకు స్ట్రెచర్, అంబులెన్స్ లేకపోవడంతో రోగి బంధువులు ఇంటి నుండి మంచం తీసుకొచ్చారు. మంచంపై మృతదేహాన్ని ఉంచి ట్రాక్టర్ లో తరలించారు. ఈ ఘటన ఝార్ఖండ్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.