పులివెందుల పట్టణ పరిధి పార్నపల్లి రోడ్డు లోని రాజారెడ్డి కాలనీ దగ్గర షార్ట్ సర్క్యూట్ తో ఒక సర్వీసింగ్ సెంటర్, టిఫెన్ సెంటర్ దగ్దమయ్యాయి. రేకులు, కట్టలతో కూడిన ఫెడ్ల లో ఉన్న రజియా టిఫిన్ సెంటర్ వద్ద మా భాష సర్వీసింగ్ సెంటర్ నడుపుతున్నారు. గురువారం రాత్రి పనులు ముగించుకొని షాపు మూసి వెళ్లారు. తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కల వారు చూసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే సర్వీసింగ్, టిఫిన్ సెంటర్ తో పాటు వాటిలో వస్తువులు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో రూ. 2 లక్షల దాకా నష్టం వాటిల్లినట్లు షాప్ యాజమానులు తెలిపారు.