బాలికకు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్‌పై ఎక్కించుకొని తీసుకెళ్లి ఓ యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఒంగోలులో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. టంగుటూరు మండలం వల్లూరుకు చెందిన బద్రి స్థానిక సుజాతా నగర్‌లోని ఓ చర్చిలో కారుడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అదే ప్రాంతంలో ఉంటూ పదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఆ చర్చి సమీపంలోనే రోజూ ఆటో ఎక్కి పాఠశాలకు వెళుతుంది. శుక్రవారం ఉదయం ఆటో కోసం వేచి ఉన్న బాలికతో మాటలు కలిపి పాఠశాల వద్ద వదలి పెడుతానని చెప్పి బద్రి తన బైక్‌పై ఎక్కించుకున్నాడు. మాయమాటలు చెప్పి కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీలో ఏడో లైనులోని తన ఇంటికి తీసుకెళ్లాడు. వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం తిరిగి బాలికను పాఠశాల వద్ద వదిలి వెళ్లాడు. అయితే బాలిక సకాలంలో పాఠశాలకు రాకపోవడంతో టీచర్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు బాలిక పాఠశాలకు వచ్చే సమయానికి తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్లావు అని ప్రశ్నించడంతో జరిగిన విషయం తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో ఒంగోలు తాలుకా పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అత్యాచారం, పో క్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలుకా ఇన్స్పెక్టర్ శ్రీని వాసరెడ్డి తెలిపారు.