విజయనగరం జిల్లా, రాజాం మునిసిపాల్టీలో 250 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వైసీపీ సీనియర్ నాయకుడు, తెలగ వీధికి చెందిన నంది సూర్యప్రకాశరావు, ప్రముఖ వ్యాపారవేత్త బనిశెట్టి వెంకటరావుల ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. సూర్యప్రకాశరావు గ్రంథాలయ సంస్థ మాజీ డైరెక్టర్. వైసీపీ విధానాలు నచ్చక ఆ పార్టీని వీడినట్టు చెప్పారు. వారిని మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, దుప్పలపూడి శ్రీనివాసరావు, శాసపు రమేష్‌కుమార్, పిన్నింటి మోహనరావు, కిమిడి అశోక్, దూబ ధర్మారావు, గురవాన నారాయణరావు, టంకాల కన్నంనాయుడు పాల్గొన్నారు.