గన్నవరం ఘర్షణల్లో అరెస్టయిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభి కస్టడీ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది. పట్టాభిని రెండు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం పోలీసులు పిటిషన్ను దాఖలు చేశారు. అసలు పట్టాభి గన్నవరం ఎందుకు వచ్చి ప్రేరేపిత వ్యాఖ్యలు చేశారో తెలుసుకోవడానికి విచారణకు అప్పగించాలని కోరారు. అయితే దీన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి శిరీష తిరస్కరించారు. ఈ కేసు విజయవాడలోని ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు పరిధిలోకి వస్తుందని వ్యాఖ్యానించి పిటిషన్ను శుక్రవారం రిటర్న్ చేశారు. మరోపక్క పట్టాభి బెయిల్ పిటిషన్పై విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి.