ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, పోడూరుసమీపంలో రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే..... నరసాపురం మండలం లిఖిత పూడికి చెందిన యనమదుర్తి సుబ్బారావు, భార్య మంగతాయారు (55) ద్విచక్రవాహనంపై పెనుగొండ మండలం కొఠాలపర్రులో వివాహానికి హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో జిన్నూరు కనకదుర్గమ్మ ఆలయం వద్దకు వచ్చే సరికి వెనుక నుంచి టిప్పర్ లారీ వీరి వాహనాన్ని ఢీ కొట్టింది. ఈఘటనలో మంగతాయారు మృతి చెందగా, సుబ్బారావు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్నాడు.