సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బీఎ సాల్మన్‌రాజు, జిల్లా అధ్యక్షుడు బి.రెడ్డిదొర మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. జగన్మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో అధికారంలోకి వస్తే వారం లో సీపీఎస్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని, నేటికీ హామీ నెరవేర్చ లేదని మండిపడ్డారు. తక్షణం 12వ వేతన సంఘాన్ని నియమించాలని, పెండింగ్‌లో ఉన్న డీఎలు మంజూరు చేసి, ప్రతి నెలా 1న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలని, 3, 4, 5 తరగతుల విలీనాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.