అదాని కంపెనీల కుంభకోణంపై సమగ్ర దర్యాప్తు జరిపి, ఆ కంపెనీకి అప్పగించిన ప్రభుత్వ సంస్థలను వెనక్కు తీసుకోవాలని సీపీఎం ఏలూరు నగర కార్యదర్శి పళ్లెం కిశోర్ డిమాండ్ చేశారు. పాతబస్టాండ్ సెంటర్‌లో శుక్రవారం ధర్నా నిర్వహించారు. కిశోర్ మాట్లాడుతూ అదానీ కుంభకోణం వల్ల షేర్ మార్కెట్లో మదుపరుల సొమ్ము రూ.5.60 లక్షల కోట్లు ఆవిరైపోయాయన్నారు. ఎక్కువ మంది మధ్య తరగతి మదుపర్లు నష్టపోయారన్నారు. అదానీ కంపెనీలకు నరేంద్రమోదీ ప్రభుత్వం రాయితీ లు అందిస్తూనే ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పివి రామకృష్ణ, వి సాయిబాబు, జగన్నాధరావు, వివిఎన్ ప్రసాద్, జె గోపీ, మావూరి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.