వచ్చే ఎన్నికల్లో సమర శంఖారావం పూరించేలా నియోజకవర్గ కన్వీనర్లకు, క్లస్టర్, యూనిట్, బూత్ లెవల్ ఇన్చార్జ్లకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారు. ఏలూరు సమీపాన చొదిమెళ్ళ శివారున శుక్రవారం జోన్–2 తెలుగుదేశం శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 34 నియోజకవర్గాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జ్లు, మండల అధ్యక్షులు, నియోజకవర్గ కన్వీనర్లు ఇందులో పాల్గొన్నారు.