ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాత కేసులో నేర రుజువు, డిమాండ్ కు నిందితులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 25, 2023, 02:42 PM

యువకుడు ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించారన్న అభియోగంపై ముగ్గురు నిందితులను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపర్చినట్లు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా,  మండవల్లి ఎస్సై టి. రామకృష్ణ తెలిపారు. గత ఏడాది డిసెంబరులో మండవల్లి మండలం ఇంగిలిపాకలంక గ్రామంలో మోరు రాజవర్ధన్‌ అనే యువకుడు చేపలచెరువు వద్ద ఉన్న మేతల షెడ్డులో ఆత్మహత్య చేసుకోగా మృతిపై అనుమానాలున్నాయని అతని తండ్రి వెంకన్న మండవల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రామకృష్ణ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడు రాజవర్ధన్‌కు సమీపాన గల మరో చెరువుకు చెందిన ముంగర తిరుపతి వెంకన్న మధ్య వివాదం జరగగా మనస్తాపానికి గురైన రాజవర్ధన్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల విచారణలో ఆ వివాదంలో ముంగర తిరుపతి వెంకన్న, ముంగర దమయంతిరాజు, ముంగర శ్రీనివాసరావు ఆత్మహత్యకు ప్రేరేపితంగా వ్యవహరించి రాజవర్ధన్‌ ఆత్మహత్యకు కారణమయ్యారని, వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరపర్చగా న్యాయమూర్తి వారికి రిమాండ్‌కు విధించినట్టు ఎస్సై తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com