వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ మాజీ మంత్రులు ఫైర్ అయ్యారు. నేడు మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ... క్యాబినెట్ విస్తరణ అనే బిస్కెట్ తో చిత్త కార్తీ కుక్కలా కొడాలి మోరుగుతున్నాడని విమర్శించారు. చంద్రబాబు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, కొడాలి నాని బూతులు మాట్లాడుతున్నాడన్నారు. సీఎం జగన్ బూట్లు నాకుతున్న కొడాలి నానికి, మతి కూడా పోయినట్లుందన్నారు. గుడివాడ గూట్లే కొడాలి నానికు పరువు పోయిందని, కోటి రూపాయలకు కోర్టు నోటీసు పంపాడన్నారు. బూతులు మాట్లాడినప్పుడు, క్యాసినో డాన్సులు వేయించిన వాడికి పరువు ఉంటుందా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు.