వైఎస్ వివేకా హత్య కేసుపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం తిరుమలలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వివేక మృతిపై సీబీఐకి సహకరించడం లేదని, తెలుగుదేశంకు.. గూగుల్ టెక్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. వివేకానంద రెడ్డి హత్య వెనుక.. జగన్ మోహన్ రెడ్డి హస్తం ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని కరప్ట్ చేసి.. అవినీతి పరిపాలన చేస్తున్నప్పుడు సీఎం జగన్‌కు సరైన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాలో ఐపీసీ అమలు కావడంలేదని, జేపీసీ (జగన్ పీనల్ కోడ్) అమలవుతోందన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ పోయి జగన్ పీనల్ కోడ్ వచ్చిందన్నారు. పోలీసులు కూడా జేపీసీనే ఫాలో అవుతున్నారన్నారు.