విశాఖ జిల్లాలోని కంచరపాలెంలో రౌడీషీటర్ శ్యామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వేధింపులే కారణమంటూ శ్యామ్ సెల్ఫీ వీడియో కలకలం రేగింది. గంజాయి అక్రమ రవాణా కేసులో గతంలో శ్యామ్ జైలుకు వెళ్లారు. ఇటీవలే జైలు నుంచి శ్యామ్ విడుదలయ్యారు. పోలీసులు మళ్లీ గంజాయి కేసులు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి శ్యామ్ మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి బంధువులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానినికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. అధికారులు తమకు సరైన న్యాయం చేయాలంటూ మృతుడి కుటుంబీకులు వాపోతున్నారు.