యుక్త వయస్కులతోపాటు కొంతమందికి ముఖంపై మొటిమలు వేధిస్తున్నాయి. వాటి నివారణకు కూడా ఓ మార్గముంది మరి. మొటిమలు వేడి వాతావరణంలో చాలా మంటగా, నొప్పిగా అనిపిస్తాయి. మీరు తక్షణ ఉపశమనం పొందాలంటే పొడి వస్త్రంలో ఐస్ క్యూబ్స్ వేసి మొటిమలు ఉన్న ప్రాంతంలో అద్దాలి. ఇలా ఐదు నిమిషాలు చేస్తే హాయిగా అనిపిస్తుంది. మొటిమలు త్వరగా తగ్గిపోతాయి.