ఏపీ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను మార్చి 17న శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది. మార్చి 14న ప్రారంభం కానున్న సమావేశాలను విశాఖలో జీ20 సమావేశాల నేపథ్యంలో 25 లేదా 27న సమావేశాలను ముగించనున్నారు. 22వ తేదీన ఉగాది సందర్భంగా ఒకటి లేదా రెండు రోజులు సెలవులు ఇవ్వనున్నారు. ఈ సమావేశాల్లో సీఎం కార్యాలయం విశాఖకు తరలింపుపై ముఖ్యమంత్రి ప్రకటన చేయనునన్నట్లు తెలుస్తోంది.