ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 3,000 ఆలయాలను నిర్మిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవదాయ శాఖ ఆధ్వర్యంలో టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా కొత్త ఆలయాలను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. ఒక్కో ఆలయాన్ని రూ.10 లక్షల వ్యయంతో నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి 30 ఆలయాలకు ఒక ఇంజనీరింగ్ అధికారిని నియమిస్తామని కొట్టు సత్యనారాయణ తెలిపారు.