కర్ణాటక రాష్ట్రంలో వందే భారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో రైలు కోచ్ లోని రెండు కిటికీలు ధ్వంసం అయ్యాయి. కృష్ణరాజపురం-బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని నైరుతి రైల్వే తెలిపింది. పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa