సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రడూడ్ విద్యావ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు తనను కలచివేస్తున్నాయని అన్నారు. నల్సార్ లా యూనివర్సిటీ రజతోత్సవ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలు చేస్తుంటే మన విద్యాసంస్థల్లో ఎక్కడో తప్పు జరుగుతున్నట్లు అర్థమవుతుందని, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాలను కోల్పోతున్నారని బాధపడ్డారు.