అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు భారతసంతతికి చెందిన నిక్కీ హేలీ ప్రకటించారు. ఈ మేరకు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. తాజాగా పాకిస్తాన్, చైనా దేశాలపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు దేశాలను చెడ్డ దేశాలుగా పేర్కొన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికాకు వ్యతిరేక దేశాలకు నిధులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. దేశ ప్రజల కష్టాన్ని వృథా కానివ్వనన్నారు. మిత్ర దేశాలకు మాత్రమే సాయం చేస్తామన్నారు.