ఈ దేవుడికి చాక్లెట్ నైవేద్యంగా పెడితే మన తీరని కోరికలు తీరతాయట. కేరళ రాష్ట్రంలోని ‘తెక్కన్ పలని’ బాలసుబ్రమణ్య(కుమారస్వామి) ఆలయంలో ఈ వింత ఆచారం కొనసాగుతోంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ ఆలయం మంచ్ మురుగన్ ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఒక చిన్న పిల్లవాడు బాలమురుగన్‌కు మంచ్ చాక్లెట్ అందించిన తర్వాత, భగవంతుడు అతన్ని మెచ్చుకున్నాడని ఇక్కడి భక్తుల నమ్మకం.