సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే నష్టాలేనని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైనట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. డయాబెటిస్, స్థూలకాయం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యాల ప్రభావం పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యంపై సాఫ్ట్, ఫిజి డ్రింక్స్ ప్రభావం చూపుతాయంటున్నారు. ఈ డ్రింక్స్ టెస్టోస్టిరాన్ స్థాయిల మీద ప్రతికూల ప్రభావం చూపుతోందని అంటున్నారు.