బిహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలన్నీ ఏకమైతే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని 100 సీట్లకే పరిమితం చేయవచ్చన్నారు. ప్రతిపక్షాలతో జట్టుకట్టే విషయంలో కాంగ్రెస్ ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. 'నా సూచనను మీరు అంగీకరిస్తే బీజేపీని 100 సీట్లలోపే కట్టడి చేయవచ్చు. అంగీకరించని పక్షంలో ఏం జరుగుతోంది మీకు తెలుసు' అని కాంగ్రెస్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.