దేశంలో వేసవికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని తీర ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతోంది. ఈ ఏడాది మనకు ఎల్ నినో ముప్పు పొంచి ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని ఫలితంగా మార్చి నుండి మరింత ఎక్కువగా వేడి, వడగాల్పులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.