కుల, మత ప్రాతిపదికన దేశప్రజలను విభజించే కుట్రకు బీజేపీ తెరతీసిందని ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోపించారు. ఢిల్లీ నుంచి పూర్ణియాలో మహాకూటమి ర్యాలీని ఉద్దేశించి వర్చువల్ గా ప్రసంగించారు లాలూ. 'మైనారిటీలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు గిట్టదు. కులం, మతాల వారీగా జనాన్ని విడగొట్టడమే బీజేపీ పని. ఆ పార్టీని ఓడించే సంకల్పానికి బిహార్ నుంచి శ్రీకారం చుడదాం' అని పిలుపునిచ్చారు.