కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సెషన్ చివరి రోజుకు చేరింది. ఈరోజు ప్రతినిధులను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు. అంతకు ముందు వ్యవసాయం, యువత, సామాజిక న్యాయానికి సంబంధించిన మూడు తీర్మానాలపై చర్చిస్తారు. మూడు తీర్మానాలపై ఉదయం చర్చలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటలకు ప్లీనరీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముగింపు ప్రసంగం చేస్తారు.