ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈరోజు సీబీఐ మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో ఆయన ఆసక్తికర ట్వీట్ చేశారు. తాను నెలల తరబడి జైల్లో గడపాల్సి వచ్చినా పట్టించుకోనని పేర్కొన్నారు. ‘నేను భగత్ సింగ్ అనుచరుడిని, దేశం కోసం భగత్ సింగ్ ఉరి తీయబడ్డాడు’ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలు కూడా అవాస్తమని చెప్పుకొచ్చారు.