ధాన్యానికి డబ్బు చెల్లించకుండా రైతులను ఇక్కట్ల పాల్జేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని గుడివాడ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రావి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మండలంలోని విన్నకోట గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో రావి పాల్గొన్నారు. ధాన్యాన్ని డబ్బు చెల్లించని జగన్ ప్రభుత్వం, మినుము కూడా ఆర్బీకేల ద్వారా కొంటామని చెప్పి నట్టేట ముంచుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని రంగాలు కుదేలయ్యాయని దుయ్యబట్టారు. టీడీపీ నాయకులతో కలిసి విన్నకోట గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.