మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ మంత్రులు, ముఖ్య నేతలు తిరుపతిలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రోజా మాట్లాడారు. రాజకీయాల్లోకి రావాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ను నారా లోకేష్ ఆహ్వానించడంపై ఆమె తాజాగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని స్పష్టం చేశారు. టీడీపీ ఎన్టీఆర్ పార్టీ అని, జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్ప ఆ పార్టీకి మనుగడ లేదని ఇప్పుడు అర్థమైందని వ్యంగ్యంగా అన్నారు. లోకేష్ పాదయాత్రకు జనం లేరని, చిత్తూరు జిల్లాలో టీడీపీకి ఇన్ చార్జిలు లేరని అన్నారు.