ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈరోజు చాలా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈరోజు సాయంత్రం సీబీఐ అరెస్ట్ చేసింది. అతడిని విచారణకు పిలిచిన సీబీఐ అధికారులు.. ఆ తర్వాత అరెస్టు చేస్తున్నామని తెలిపారు.సిసోడియా విచారణ, అరెస్టు నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. కాగా, మనీష్ సిసోడియాకు రేపు మధ్యాహ్నం అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ప్రత్యేక సీబీఐ కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ ప్రభుత్వ కొత్త మద్యం పాలసీని ఖరారు చేయడంతోపాటు ఢిల్లీ మద్యం కుంభకోణానికి మార్గం సుగమం చేయడం వెనుక సిసోడియా అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.