ఖలిస్తాన్ వేర్పాటువాది అమృత్ పాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిక్కుల ఊచకోత అనంతరం జరిగిన పరిణామాల్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి పట్టిన గతే హోంమంత్రి అమిత్ షాకు కూడా పడుతుందని హెచ్చరించారు. 'ఖలిస్థాన్ జిందాబాద్ అంటే తప్పు అయినప్పుడు హిందుస్థాన్ జిందాబాద్ అంటే ఎందుకు తప్పుకాదు? హిందుస్థాన్ అంటే ఎక్కడ ఉంది?' అని ప్రశ్నించారు.