ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య సేవలపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. పీహెచ్సీల పనితీరు అద్భుతమని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ఏపీలోని 1,142 గ్రామీణ పీహెచ్సీలు నూటికి నూరు శాతం 24 గంటల పాటు సేవలు అందిస్తున్నాయని, దేశంలోని 45.1 శాతం పీహెచ్సీల్లోనే 24 గంటల సేవలు అందుతున్నట్లు తెలిపింది. ఏపీ తర్వాత సిక్కింలోనూ 24 గంటల సేవలు అందుతున్నాయని పేర్కొంది.